మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజకుంద్రాకు ఊరట..
వినోదం, 11 అక్టోబర్ (హి.స.) మనీలాండరింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ నటి శిల్పాశెట్టి ద
శిల్పా శెట్టి దంపతులకు ఊరట


వినోదం, 11 అక్టోబర్ (హి.స.)

మనీలాండరింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ నటి శిల్పాశెట్టి దంపతులు ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఈడీ నోటీసులపై స్టే విధించింది. కాగా, 2017లో రాజ్ కుంద్రా సంస్థ బిట్ కాయిన్ల రూపంలో దాదాపు రూ. 6.600 కోట్లు వసూలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. నెలకు 10% రిటర్న్లు ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు కేసు ఫైల్ అయింది.

అమిత్ భరద్వాజ్ అనే వ్యక్తి నుంచి రాజ్కుంద్రా సుమారు 285 బిట్కాయిన్లు తీసుకున్నారని, వాటితో ఉక్రెయిన్లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఈడీ.. శిల్పా శెట్టి దంపతులకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ముంబాయిలోని శిల్పాశెట్టి పేరుపై ఉన్న ఒక బంగ్లా, పూణేలోని ఒక ఫ్లాట్, కుంద్రా పేరుపై ఉన్న ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఈ మేరకు భవనాలను ఖాళీ చేయాలనీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై శిల్పాశెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ నోటీసులపై స్టే ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande