వినోదం 12 అక్టోబర్ (హి.స.)
అభిమానులకు దసరా పండుగ
కానుకగా మెగాస్టార్ చిరంజీవి పాత్రలో నటిస్తోన్న విశ్వంభర చిత్రం నుంచి టీజర్ను విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి గల ఈ టీజర్
ప్రేక్షకులను కట్టిపడేసింది. విజువల్ వండర్గా రూపొందించడంతో మెగా ఫ్యాన్స్ ఎగ్జిటింగ్గా ఫీలయ్యారు. యువ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ
చిత్రంలో త్రిష అశిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి
సంగీతం అందిస్తున్నారు.కాగా, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. దాదాపు 200
కోట్ల బడ్జెట్తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి, సురభి, ఇషా
చావ్లా నటిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..