న్యూఢిల్లీ, 13 అక్టోబర్ (హి.స.)
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచదేశాల్లో మార్పు తెచ్చే ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. కాగా.. మోడీ గురించి ఓ పుస్తకంలో బోరిస్ జాన్సర్ రాసిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఈ పుస్తకం త్వరలో యూకేలో విడుదల కానుంది. 'అన్టీష్లోడ్' పేరిట బోరిస్ జాన్సన్ రాసిన పుస్తకంలో ఆయన తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీతో సమావేశమైన వివిధ సందర్భాల గురించి వివరించారు. మోడీతో తన మొదటి సమావేశం గురించి ప్రస్తావించారు. ఆయనను కలిసినప్పుడు తాను ఆనందంగా ఉంటానని పేర్కొన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో మోడీ ఒకరని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్చా-వాణిజ్య ఒప్పందాలకు మోడీ పునాది వేశారన్నారు. “2022లో నేను పలు వివాదాల్లో చిక్కుకున్నాను. వీటిపై బ్రిటన్ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ.. రిషి సునాక్ నాకు ద్రోహం చేశారు. ఆయన కారణంగానే సొంత పార్టీ నేతలు కూడా నాకు దూరమయ్యారు” అని బోరిస్ జాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్