యూపీ ఎన్నికల్లో పోటీపై అసదుద్దీన్ ఓవైసీ క్లారిటీ
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో పోటీపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ క్లారిటీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో క్రియాశీలకంగా ఉన్న అప్నా దళ్ (కామెరవాడి) పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మ
అసదుద్దీన్ ఓవైసీ


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో

పోటీపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ క్లారిటీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో క్రియాశీలకంగా ఉన్న అప్నా దళ్ (కామెరవాడి) పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్ పై కీలక ప్రకటన చేశారు. రానున్న ఉప ఎన్నికల్లో తాము తమ సోదరి డాక్టర్ పల్లవి పటేల్ (అప్నాదళ్, కెమెరావాడి)తో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే పొత్తుకు సంబంధించిన చర్చలు ముగిసినట్లు తెలిపారు. తమ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని అక్కడి పార్టీ చీఫ్ తనకు చెప్పారని, మిగిలిన సీట్లను పల్లవి పటేల్ నిర్ణయిస్తారని అన్నారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో మా రెండు పార్టీలు కలిసి పోటీ చేసి, అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని అసద్ చెప్పారు. కాగా ఉత్తరప్రదేశ్ లో ఖాళీగా ఉన్న తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ఎనిమిది స్థానాల్లోని ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికవ్వగా.. మరో స్థానంలో సమాజ్ వాది పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande