సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గౌతం ఆదాని
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. ఈ క్
గౌతమ్ ఆదాని


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. ఈ క్రమంలోనే అదానీ ఫౌండేషన్ నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారని పేర్కొన్నారు.

కాగా, ఈ సమావేశంలో అదానీ గ్రూప్ ఫౌండేషన్ ప్రతినిధులు, సీఎస్ శాంతి కుమారి, ఇతర అధికారులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను నియమించిన సంగతి విదితమే.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande