ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు
ఏ.పీ, 18 అక్టోబర్ (హి.స.) రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో హెడ్ క్వార్టర్, 5 జోన్లలో 5 ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జులు, ముఖ్యనేతలతో మంగళగిరి టీడీపీ కేంద్
రతన్ టాటా ఇన్నోవేషన్


ఏ.పీ, 18 అక్టోబర్ (హి.స.)

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద

అమరావతిలో హెడ్ క్వార్టర్, 5 జోన్లలో 5 ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జులు, ముఖ్యనేతలతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రతన్ టాటా స్ఫూర్తితోనే ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక వ్యవస్థాపకులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేస్తామని, అందులో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

జాబ్ ఫస్ట్ విధానంతో దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు అదనంగా ఇస్తామని కంపెనీలకు చెప్పామని చంద్రబాబు పేర్కొన్నారు.. 10 శాతం అదనంగా ఉద్యోగాలు కల్పించే వారికి ప్రోత్సాహకాలు మరింత ఇస్తామని ప్రకటించమని తెలిపారు. ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ ఎంటర్ ప్రెన్యూర్ డెవలెప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఎనర్జీ....ఇలా 6 పాలసీలు తీసుకొచ్చామన్నారు. సూపర్ 6 హామీలులాగే సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చామని చెప్పారు. ఇవి అమలైతే ఏపీ నెంబర్ వన్గా అవుతుందని చంద్రబాబు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande