రాష్ట్రంలో నాకూటమి ప్రభుత్వం. వచ్చాక రాష్ట్ర సచివాలయంలో. మొదటిసారి అప్పా సర్వసభ్యండమావేశం
విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సచివాలయంలో మొదటిసారిగా అప్సా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఉద్యోగులందరూ ముక్తకంఠంతో అప్సా ప్రస్తుత అధ్యక్షుడు, వైసీపీకి వీరవిధేయుడు, జగన్‌కి పరమభక్తు
రాష్ట్రంలో నాకూటమి ప్రభుత్వం. వచ్చాక రాష్ట్ర సచివాలయంలో. మొదటిసారి అప్పా సర్వసభ్యండమావేశం


విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సచివాలయంలో మొదటిసారిగా అప్సా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఉద్యోగులందరూ ముక్తకంఠంతో అప్సా ప్రస్తుత అధ్యక్షుడు, వైసీపీకి వీరవిధేయుడు, జగన్‌కి పరమభక్తుడైన కె.వెంకట్రామిరెడ్డిని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి దాదాపు 400 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అప్సా సభ్యులందరూ ఏకకంఠంతో తమ డిమాండ్‌ను వినిపించారు. ‘ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యవర్గం రాజీనామా చేయాలి. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేయాలి. తద్వారా ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వైసీపీకి కార్యకర్తలా పనిచేసిన వెంకట్రామిరెడ్డి అప్సా అధ్యక్షుడిగా ఉండడం వల్ల మా సమస్యలను ప్రస్తుత ప్రభుత్వానికి నివేదించలేకపోతున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసమైనా అధ్యక్ష పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయాలి. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం వల్ల మాకు ఏ ప్రయోజనాలు దక్కలేదు. కనీసం జీతం కూడా సరైన సమయానికి రాలేదు. కొత్త కార్యవర్గం ఎన్నికైతే కనీసం ఇప్పుడైనా మాకు రావాల్సిన ప్రయోజనాలు అందుతాయని ఆశిస్తున్నాం. వెంకట్రామిరెడ్డి మొండి వైఖరి వల్ల ఎన్నో దశాబ్దాల చరిత్ర గల అప్సా ఉనికికే ముప్పు ఏర్పడింది. రోసా నిబంధనల ప్రకారం అసోసియేషన్‌ రద్దుకు ప్రభుత్వం ఫైలు పెట్టింది. అప్సాను రక్షించుకోవడం కోసం మేమంతా ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చి అసోసియేషన్‌ రద్దుకాకుండా ప్రస్తుతానికి ఆపగలిగాం. దీనంతటికీ కారణమైన వెంకట్రామిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి’ అంటూ సభ్యులు గట్టిగా డిమాండ్‌ చేశారు. వారి వాదనను కొట్టిపారేసిన వెంకట్రామిరెడ్డి... ‘2029లో కూడా ఈ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా? మీ డిమాండ్‌కు తలొగ్గేదే లేదు. పదవీకాలం పూర్తయ్యేవరకు వైదొలగే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. అప్సా కార్యదర్శి శ్రీకృష్ణ మాత్రం పదవికి రాజీనామా చేస్తున్నట్టు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande