సీఎం రేవంత్ రెడ్డి, డిజిపి జితేందర్ కు రాజా సింగ్ కీలక విజ్ఞప్తి
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిజిపి జితేందర్ కు గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ బషీర్, రె
రాజాసింగ్ విజ్ఞప్తి


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిజిపి జితేందర్ కు గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ బషీర్, రెహ్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని స్థానికులు చితక్కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరి మాటలు విని గుడిపై దాడి చేశాడో పోలీసులు స్పష్టంగా ఎఫ్ఎఆర్ పేర్కొన్నారు. ఆలయంపై దాడి చేసిన వారిని రెచ్చగొట్టింది మునావర్ జామా అనే వ్యక్తి.. అతడు ముంబైలో ఉంటాడు. దేశంలో రెండో జాకీర్ నాయక్ కావాలనేది అతడి ఆశయం. దాదాపు 100 నుంచి 150 మందిని మెట్రోపోలీస్ హోటల్లో పెట్టుకుని హిందూ ధర్మం, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ గుర్తుచేశారు.

అతని పేరును ఎఫ్ఆర్లో పేర్కొన్న పోలీసులు.. ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. 100 నుంచి 150 మందికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి బయటకు పంపించారు కానీ అతన్ని అరెస్ట్ చేయలేదని అన్నారు. బషీర్, రెహ్మాన్లు ఇద్దరూ మునావర్ జామా మాటలు వినే అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. జాకీర్ నాయక్ మాటలు విని చాలామంది టెర్రరిస్టులుగా మారారని రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? పోలీసులు ఈ కేసును ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? అని సీఎం రేవంత్, డీజీపీ జితేందర్ను రాజాసింగ్ అడిగారు. దయచేసి హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే నిర్లక్ష్యం వహించొద్దని రిక్వెస్ట్ చేశారు. మీరు లైట్ తీసుకున్నా.. తాము తీసుకోబోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande