జనవరిలో తల్లికి.వందనం మార్చ్.ఏప్రిల్లో అన్నదాత సుఖీభవ పథకాలు.అమలు
విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.)జూన్‌ వచ్చింది... పోయింది! ఇంకా తల్లికి వందనం పథకం అమలు కాలేదు’ అని ఎదురు చూపులు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త! ‘సూపర్‌ సిక్స్‌’లో కీలకమైన ఈ పథకం కింద వచ్చే ఏడాది జనవరిలో తల్లులకు కాసులు అందనున్నాయి. పాఠశ
జనవరిలో తల్లికి.వందనం మార్చ్.ఏప్రిల్లో అన్నదాత సుఖీభవ పథకాలు.అమలు


విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.)జూన్‌ వచ్చింది... పోయింది! ఇంకా తల్లికి వందనం పథకం అమలు కాలేదు’ అని ఎదురు చూపులు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త! ‘సూపర్‌ సిక్స్‌’లో కీలకమైన ఈ పథకం కింద వచ్చే ఏడాది జనవరిలో తల్లులకు కాసులు అందనున్నాయి. పాఠశాలలకు, జూనియర్‌ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల తల్లులందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ రూ.15వేల చొప్పున అందించనుంది. అలాగే... రైతులకు ఏటా రూ.20వేల చొప్పున లబ్ధి చేకూర్చే ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రారంభించనున్నారు. ‘చదువుకునే పిల్లలందరికీ... ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి రూ.15వేల చొప్పున ఇస్తాం!’... అని 2019 ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు. ఆ తర్వాత... పిల్లలందరికీ కాదు, తల్లికి మాత్రమే అని చెప్పారు. 15వేలలో రూ.2వేలు కోత వేశారు. గతేడాది జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లో 83,15,341 మంది విద్యార్థులు ఉండగా... వారి తల్లులు 42.61లక్షల మందికి ‘అమ్మ ఒడి’ అమలు చేశారు. దీనికి రూ.6394 కోట్లు ఖర్చయింది. విద్యార్థుల లెక్క కాకుండా తల్లుల లెక్కన ఇస్తేనే ఇంత భారం! ఇప్పుడు... విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’ అమలు చేయాల్సి ఉంది. ఈ ఏడాది కూడా దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ‘తల్లికి వందనం’ అమలు చేసేందుకు దాదాపు 12వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా!

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande