ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఆఫ్ లో పెరిగిన మోటార్ సైకిల్ల అమ్మకాలు
బిజినెస్, 20 అక్టోబర్ (హి.స.) సెప్టెంబర్ నెల తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో మన దేశంలో ద్విచక్ర వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. మోటార్ సైకిళ్లు, స్కూటర్లతో కలిపి దాదాపు కోటికి పైగా అమ్ముడు పోయాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ ఫైనాన్సియల్ ఇ
బిజినెస్ న్యూస్


బిజినెస్, 20 అక్టోబర్ (హి.స.)

సెప్టెంబర్ నెల తో ముగిసిన

ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో మన దేశంలో ద్విచక్ర వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. మోటార్ సైకిళ్లు, స్కూటర్లతో కలిపి దాదాపు కోటికి పైగా అమ్ముడు పోయాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ ఫైనాన్సియల్ ఇయర్ లో 1,01,64,980 యూనిట్ల వరకు సేల్ అయ్యాయి. దీని బట్టి చూస్తే ద్విచక్ర వాహనాల ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ, ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని స్పష్టంగా అర్ధం అవుతోంది. కాగా గతేడాది ఇదే సమయం నాటికి టూ వీలర్ అమ్మకాలు 87,39,406గా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి 16 శాతం పెరిగాయి. అయితే ద్విచక్ర వాహన పరిశ్రమ చివరిసారి 2018-19 ప్రథమార్థంలో 1,15,68,498 విక్రయాలను సాధించింది. అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఈ రికార్డు క్రియేట్ చేసింది. 2024-25 ఫైనాన్సియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో మోటార్ సైకిళ్లు 16.31 శాతం, స్కూటర్లు 22 శాతం చొప్పున అధికంగా అమ్ముడుపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande