ముంబయి, 30 అక్టోబర్ (హి.స.)బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan)కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా గుర్తుతెలియని ఓ వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు సందేశం వచ్చింది. రూ.రెండు కోట్లు చెల్లించకపోతే.. నటుడిని చంపేస్తామని బెదిరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఇటీవల ఓ ఆగంతకుడి నుంచి సందేశం వచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్‌ఖాన్ (Salman Khan) ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5 కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ (ఇటీవల హత్యకు గురైన) కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని అందులో ఉంది. అనంతరం అతడు మరో సందేశం పంపించాడు. ‘‘నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి’’ అని పేర్కొన్నాడు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు