న్యూఢిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)
దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ దీపాలు, లైట్ షోల కాంతుల్లో దగదగ మెరుస్తున్నాయి. అయోధ్య మొదలు అన్ని ఆలయాలు దీప కాంతులను వెదజల్లుతున్నాయి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం కూడా పూలతో ముస్తాబయ్యింది. దీపావళి సందర్భంగా మంచు కొండల నడుమ నిండా పూలతో అలంకరించుకుని ఉన్న ఈ ఆలయం చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ ఆలయాన్ని నవంబర్ 3వ తేదీ ఉదయం 8.30కు మూసివేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్