
చెన్నై14 డిసెంబర్ (హి.స. కమల వికాసానికి నిదర్శనం రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ కైవసం. వామపక్ష, కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్రంగా ఉండే కేరళలో, బీజేపీ రాజధానిని గెలుచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 45 ఏళ్ల నిరంతర సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి పాలనకు బీజేపీ ముగింపు పలికింది. ఇప్పుడు, త్రివేండ్రం మేయర్‌గా బీజేపీ వ్యక్తి రాబోతున్నారు. అయితే, మేయర్ రేసులో కేరళ మాజీ ఐపీఎస్ అధికారిణి, 2020లో డీజీపీగా పదవీ విమరణ చేసిన ఆర్ శ్రీలేఖ ముందు వరసలో ఉన్నారు. శాస్తమంగళం డివిజన్‌లో భారీ మెజారిటీతో గెలిచారు. 64 ఏళ్ల శ్రీలేఖనే త్రివేండ్రానికి కాబోతున్న తొలి బీజేపీ మేయర్ అని తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ మేయర్ ఎవరు అవుతారు అనేది స్పష్టంగా చెప్పకున్నా, శ్రీలేఖనే తొలి ప్రాధాన్యత అని తెలుస్తోంది.
అయితే, ఈ విషయంపై మేయర్ ఎన్నికపై బీజేపీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆమె చెబుతున్నారు. శాస్తమంగళంలో ఇంత మెజారిటీలో ఇప్పటి వరకు ఎవరూ గెలించింది లేదని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు. నా అభ్యర్థిత్వాన్ని ఎల్డీఎఫ్, యూడీఎఫ్
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ