అయోధ్యలో దీపావళి సంబరాలు.. ఏకంగా 28 లక్షల దీపాలతో
అయోధ్య, 30 అక్టోబర్ (హి.స.)500 ఏళ్ల తర్వాత అయోధ్యలో నేడు రాముడి గుడిలో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కొత్త ఆలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన తర్వాత ఇది మొదటి దీపావళి. సహజంగానే ఈసారి సన్నాహాలు కూడా ఘనంగా జరిగాయి. ఈరోజు దీపాల పండుగ మొదలుకొని పుష్పక
అయోధ్యలో దీపావళి సంబరాలు.. ఏకంగా 28 లక్షల దీపాలతో


అయోధ్య, 30 అక్టోబర్ (హి.స.)500 ఏళ్ల తర్వాత అయోధ్యలో నేడు రాముడి గుడిలో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కొత్త ఆలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన తర్వాత ఇది మొదటి దీపావళి. సహజంగానే ఈసారి సన్నాహాలు కూడా ఘనంగా జరిగాయి. ఈరోజు దీపాల పండుగ మొదలుకొని పుష్పక విమానంలో స్వామి వచ్చేంత వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు సన్నాహాలు కొనసాగాయి. ఇక ఈ కార్యక్రమాలకు అయోధ్య రోడ్లు సిద్ధమయ్యాయి. నగరంలోని వీధులు, కూడళ్ల నుంచి సరయూ నది ఘాట్‌ల వరకు కూడా లైట్లతో వెలిగిపోతున్నాయి. నేడు ఈ ఘాట్‌ లను 28 లక్షల దీపాలతో వెలిగించి వరుసగా ఏడోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తమ పేరు నమోదు చేసుకోనున్నారు. పర్యాటక శాఖ అయోధ్యను అలంకరించి సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించింది. ఈసారి అయోధ్యలో కాలుష్య రహిత హరిత బాణసంచా కూడా కొత్త నమూనాను సృష్టించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande