రేవుల భద్రతకు ప్రత్యేక సంస్థ
ఢిల్లీ20 డిసెంబర్ (హి.స.) : రేవుల భద్రతను పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘బ్యూరో ఆఫ్‌ పోర్ట్‌ సెక్యూరిటీ’’ (బీఓపీఎస్‌) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సంస్థ రేవులు, నౌకలకు సంబంధించిన భద్రతా సంబంధ సమాచ
Amit shah


ఢిల్లీ20 డిసెంబర్ (హి.స.) : రేవుల భద్రతను పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘బ్యూరో ఆఫ్‌ పోర్ట్‌ సెక్యూరిటీ’’ (బీఓపీఎస్‌) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సంస్థ రేవులు, నౌకలకు సంబంధించిన భద్రతా సంబంధ సమాచార సేకరణ, విశ్లేషణ, వితరణ కార్యకలాపాలు చేపడుతుందని ఆ అధికారులు వివరించారు. రేవుల భద్రతకే అంకింతం కానున్న బీఓపీఎస్‌ సంస్థ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ఒక సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో రేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రి సర్బానంద సోనోవాల్, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు అని అధికారిక ప్రకటన తెలియజేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande