కేరళ కొచ్చిలో అమానుష ఘటన,ఎ బాలింతపై పోలీస్ అధికారి దాడి
చెన్నై20డిసెంబర్ (హి.స.) రాష్ట్రం కొచ్చిలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్‌లో బాలింతపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన మానవత్వానికే మచ్చగా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ తరహా దారుణానికి పా
కేరళ కొచ్చిలో అమానుష ఘటన,ఎ బాలింతపై పోలీస్ అధికారి దాడి


చెన్నై20డిసెంబర్ (హి.స.) రాష్ట్రం కొచ్చిలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్‌లో బాలింతపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన మానవత్వానికే మచ్చగా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ తరహా దారుణానికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలింత పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఆమెపై దౌర్జన్యం చేయడం అమానవీయమని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, 2024 జూన్ 18న కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ చంద్రన్, శైమోల్ ఎన్.జే అనే బాలింతను తోసి, అనంతరం చెంపదెబ్బ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించడంతో, అధికార యంత్రాంగం స్పందించి సంబంధిత పోలీస్ అధికారిని సస్పెండ్ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande