ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. నిఫ్టీ @ 24,800
ముంబయి: , 8 అక్టోబర్ (హి.స.)పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ సూచీలు (Stock Market) అప్రమత్తత పాటిస్తున్నాయి. దీంతో మంగళవారం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌
ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. నిఫ్టీ @ 24,800


ముంబయి: , 8 అక్టోబర్ (హి.స.)పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ సూచీలు (Stock Market) అప్రమత్తత పాటిస్తున్నాయి. దీంతో మంగళవారం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 81,133 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 24,808 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 83.93గా కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, పవర్‌గ్రిడ్‌, టైటాన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande