స్పోర్ట్స్, 17 నవంబర్ (హి.స.)
నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకునే దృష్ట్యా ఈ సిరీస్ టీమ్ ఇండియాకు చాలా ముఖ్యమైనది. కాబట్టి గెలవాలనే ఒత్తిడి జట్టుపై ఉంది.
ఈ సిరీస్లో తొలి మ్యాచ్ పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు టీమ్ ఇండియా టెన్షన్ ఎక్కువై ఆ జట్టులోని నలుగురు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. దీనికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది.ఇప్పుడు సెలక్షన్ బోర్డుకు కొత్త తలనొప్పి మొదలైంది.
భారత స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మాన్ గిల్ గాయపడ్డాడు. పెర్త్ ఇండియా ఎతో జరిగిన మ్యాచ్లో స్లిప్ క్యాచ్ తీసుకుంటూ గిల్ వేలికి గాయమైంది. గాయం కూడా తీవ్రంగా ఉండడంతో పెర్త్ టెస్టులో ఆడే అవకాశం లేదు. అతడిపై వైద్య బృందం నిశితంగా నిఘా ఉంచిందని, తొలి మ్యాచ్లో పాల్గొంటాడా లేదా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
సిరీస్ ప్రారంభం కాకముందే టీమిండియా ఆటగాళ్ల గాయాల పరంపర రోజురోజుకూ పెరిగిపోతోంది. నవంబర్ 14న, WACAలో భారత్ వార్మప్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న యువ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ మోచేయికి గాయమైంది. అతను మొదట్లో చాలా నొప్పిని ఎదుర్కొన్నప్పటికీ, అతని గాయం చాలా తీవ్రంగా లేదు.
ఈ ప్రాక్టీస్లో కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డాడు. నవంబర్ 15న, సెంటర్ వికెట్ మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో రాహుల్ కుడి మోచేయికి గాయమైంది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న రాహుల్.. బ్యాటింగ్ ను సగంలోనే నిలిపివేసి డగౌట్ కు వెళ్లాడు.
ఈ ముగ్గురి కంటే ముందే విరాట్ కోహ్లి కూడా గాయపడ్డాడు. దాంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అతని గాయం స్కాన్ నివేదికలో ఏమి సమస్య లేకపోవడంతో సెలెక్టర్లు ఊపిరి పిల్చుకున్నారు.
వీరితో పాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో భాగమవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రోహిత్ ఆడకపోతే ఓపెనింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్కి దక్కవచ్చు. శుభ్మన్ గిల్ యధావిధిగా మూడో స్థానంలో ఆడనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు అవసరమని, గాయం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆశిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..