విజయవాడ, 18 నవంబర్ (హి.స.)
గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అడపదడపా ఇన్నింగ్స్‌లు తప్పితే పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ఈ ఏడాదిలో ఆడిన 12 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. విరాట్ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతడికి మద్దతుగా నిలిచారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కింగ్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఆడే చివరి టెస్టు సిరీస్ కూడా ఇదే అయ్యే అవకాశం ఉందని దాదా అభిప్రాయపడ్డారు. ఓ క్రీడా ఛానల్‌తో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ ఒక ఛాంపియన్ ఆటగాడు. అతని వన్డే గణాంకాలు ఇప్పటికీ మెరుగ్గా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల