దిల్లీ 20 నవంబర్ (హి.స.)ఎయిర్సెల్- మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరానికి (P Chidambaram) దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం నిలిపివేసింది. సింగిల్ జడ్జి ధర్మాసనం ఈమేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
ఎయిర్ సెల్- మ్యాక్సిస్ కేసులో చిందంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయల్ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌లు దాఖలు చేసింది. దీంతో ఆయనపై విచారణకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిందంబరం హైకోర్టును ఆశ్రయిచగా.. తాజాగా ఆయనపై విచారణను నిలిపివేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల