విజయవాడ, 21 నవంబర్ (హి.స.)బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది.. యాంటీ నార్కొటిక్ టీంను ఏర్పాటు చేశాం.. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.. రౌడీషీట్లు, పీడీ యాక్ట్ కూడా పెడతాం అని వెల్లడించారు.. ఏజెన్సీల్లో పండే గంజాయి స్కూల్ బ్యాగుల్లోకి వచ్చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. గంజాయి నిర్మూలనకు చెక్ పోస్టులు పెంచాం.. సీసీ కెమెరాలు పెంచాం.. 25 వేల కేజీల గంజాయి సీజ్ చేసాం.. 916 మంది మీద కేసులు పెట్టామని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల