సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి
పెద్దపల్లి, 3 డిసెంబర్ (హి.స.) : రామగుండంలోని సింగరేణిలో ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు
సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి


పెద్దపల్లి, 3 డిసెంబర్ (హి.స.)

: రామగుండంలోని సింగరేణిలో ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌.

వివరాల ప్రకారం.. రామగుండం సింగరేణి సంస్థ 7 ఎల్‌ఈపీ గని వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఇసుక బంకర్‌లో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ దుర్మరణం చెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోవడంతో ఆయన మృతిచెందాడు. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ టీం.. బంకర్ నుండి మృతదేహాన్ని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande