హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
ప్రజా పాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు వర్చువల్‌గా ప్రారంభించారు.
ముఖ్యమంత్రి ప్రారంభించిన పలు అభివృద్ధి పనుల వివరాలు…
జిహెచ్ఎంసి పరిధిలో HCITI ఫేజ్-1లో రూ.3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.
హెచ్ఎంసీ పరిధిలోని రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు రూ.150 కోట్లతో పనులకు శంకుస్థాపన.
కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లై ఓవర్లు అండర్ పాసుల నిర్మాణానికి శంకుస్థాపన.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆరాంఘర్-బహుదూర్పుర బారీ ఫ్లై ఓవర్.
హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్‌డీసిఎల్) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.
సిటీలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ.17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను ప్రారంభించిన సీఎం.
హైదరాబాద్ వాటర్ బోర్డు అధ్వర్యంలో నిర్మించిన ఆరు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్రారంభం.
తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించిన సీఎం.
రూ.568 కోట్లతో చేపట్టే ఎస్ఎన్డీపీ పనులకు శంకుస్థాపన.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్ వేర్ ను లాంఛనంగా ప్రా
రంభించిన సీఎం. 2025 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్న విధానం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..