సినీ దర్శకుడు.రాం గోపాల్ వర్మ.ముందస్తు.బెయిల్ పిటిషన్. మంగళ వారానికి.వాయిదా
విజయవాడ, 21 నవంబర్ (హి.స.) అమరావతి: సామాజిక మాధ్యమాల వేదికగా అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు ఐటీ చట్టం కింద సినీ దర్శకుడు రాంగోపాల్. వర్మ )పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చే
సినీ దర్శకుడు.రాం గోపాల్ వర్మ.ముందస్తు.బెయిల్ పిటిషన్. మంగళ వారానికి.వాయిదా


విజయవాడ, 21 నవంబర్ (హి.స.)

అమరావతి: సామాజిక మాధ్యమాల వేదికగా అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు ఐటీ చట్టం కింద సినీ దర్శకుడు రాంగోపాల్. వర్మ )పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లపై వర్మ అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదుతో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande