ఆస్ట్రేలియాపై మొదటి టెస్టులో భారత్ అపూర్వ విజయం..
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.) ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోణి అదిరిపోయింది. పెర్త్‌ టెస్టులో కంగారూలపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 4 రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఫస్ట్ టెస్టులోనే భారత్ జట్టు సగర్వంగా 295 పరుగ
భారత్ విక్టరీ


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోణి అదిరిపోయింది. పెర్త్‌ టెస్టులో కంగారూలపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 4 రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఫస్ట్ టెస్టులోనే భారత్ జట్టు సగర్వంగా 295 పరుగుల తేడాతో గెలిచి గెలుపు జెండా ఎగురవేసింది. పెర్త్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 534 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా టీమ్‌ను 238 పరుగులకే టీమిండియా బౌలర్లు కుప్పకూల్చారు. దాంతో ఐదు టెస్టుల బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande