తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌ 29 నవంబర్ (హి.స.)ఉమ్మడి వరంగల్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విభజన హామీల్లో కేంద్ర ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎ
తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్


హైదరాబాద్‌ 29 నవంబర్ (హి.స.)ఉమ్మడి వరంగల్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విభజన హామీల్లో కేంద్ర ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని సెంట్రల్ రైల్వే అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు గత ఏడాది జులై 5వ తేదీన అప్‌గ్రేడ్‌చేయాలని దక్షిణమధ్య రైల్వే బోర్డు లేఖ రాసింది. కాగా అప్‌ గ్రేడ్ చేసిన యూనిట్‌ లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ను అభివృద్ధిం చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సంబంధించిన సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని రైల్వే బోర్డు సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande