కడప జిల్లా గ్రామీణ విద్యార్థిని కి స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో రూ. 55 లక్షల పారితోషకంతో సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..
తెలంగాణ, 17 డిసెంబర్ (హి.స.) కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిట
కడప జిల్లా గ్రామీణ విద్యార్థిని ని వరించిన అదృష్టం


తెలంగాణ, 17 డిసెంబర్ (హి.స.)

కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీ చరణి అనే విద్యార్ధిని సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఆంధ్రప్రదేశకు చెందిన అమ్మాయి. కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని.

ఓ సాధారణ కుటుంబానికి చెందిన శ్రీ చరణి.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆడబోతుంది. శ్రీ చరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి.. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్కు తమ కుమార్తె సెలెక్ట్ కావడంపై తల్లిదండ్రులు, బంధువులు, గ్రామాస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande