హైదరాబాద్, 7 జనవరి (హి.స.)
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించారు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు. గిల్‌కు ఇన్ని అవకాశాలు లభిస్తున్నప్పుడు.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. జాతీయ జట్టుకు ఆడే అర్హత ఉన్న ఆటగాళ్లను బీసీసీఐ సెలక్టర్లు విస్మరిస్తున్నారని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. యువ ప్లేయర్లను సెలక్టర్లు ప్రోత్సహించాలని సూచించారు.
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్ 1-3తో ఓడిన విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమించింది. భారత ఆటగాళ్లలో జస్త్రీత్ బుమ్రా (31 వికెట్స్) మాత్రమే రాణించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు దారుణంగా విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్ 5 ఇన్నింగ్స్ 93 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. అదే సమయంలో బీసీసీఐ సెలక్టర్లకు సైతం చురకలు అంటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..