తెలంగాణ, 4 జనవరి (హి.స.)
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.
రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. దీంతో భారత్ మొత్తం ఆధిక్యం 145 పరుగులకు చేరుకుంది. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 39 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 8 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 17 బంతుల్లో 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున రిషబ్ పంత్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. శనివారం ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. ఇందులో ఆస్ట్రేలియావి 9 వికెట్లు, భారత్ వి 6 వికెట్లు నేలకూలాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్