తెలంగాణ, 28 డిసెంబర్ (హి.స.)
మెల్ బోర్న్ – బోర్డర్-గవాస్కర్ టోర్నమెంట్ నాలుగవ టెస్ట్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ టీమిండియాను ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు. ఈ క్రమంలోనే టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. సెంచరీ సాధించడంతో స్టాండ్స్‌లో ఉన్న అతని తండ్రి ముత్యాలరెడ్డి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు లేచి నిలబడి చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కళ్ల వెంట ఆనందబాష్పాలు వర్షించాయి.. నితీష్ 90 పరుగులు చేసిన తరణం నుంచి ఆయన తన కుమారుడు శతకం చేయాలని దేవుడిని కోరుతూ ప్రతి బంతికి నమస్కారం చేయడం విశేషం.. శతకం ఆనంతరం టివి కామెంటేటర్ అతడిని ఇంటర్య్యూ చేశాడు.. బ్యాటింగ్, బౌలింగ్ లో తన కుమారుడు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎంతో కృషి చేశాడని చెప్పాడు.
కాగా, 171 బంతుల్లో ఈ రికార్డును అందుకున్న నితిష్.. ఎనిమిదో స్థానంలో వచ్చి ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కుంబ్లే (87) పేరిటా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్