హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం పై విజిలెన్స్ మెరుపు దాడులకు దిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌కు ఇటీవల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై దాడులు నిర్వహించారు. అక్రమ టెండర్ల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి అన్ని రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో రవాణా, క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇవ్వడంలో కొందరు హెచ్‌సీఏ సభ్యులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీఏ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.
కాగా, క్యాటరింగ్, రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఎంపీ చామల విజిలెన్స్ డీజీపీకి గతంలో లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్‌తో సరైన సంప్రదింపులు లేకుండా నిర్ణయాధికారాలు కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయని, టెండర్ లేకుండా ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వడం వంటి నిర్ణయాలు హెచ్‌సీఏ ప్రతిష్టకు భంగం కలిగిస్తామని ఎంపీ పేర్కొన్నారు. హెచ్‌సీఏ సమగ్రతను పునరుద్దరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డీజీపీని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..