హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో నేడు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల జంట
పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి
డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో చై మూడుముళ్లు వేయనున్నారు. ఏఎన్నార్ ఆశీస్సులు ఉండాలనే భావనతోనే ఇరు కుటుంబాల
పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు.
టాలీవుడ్ నుంచి దగ్గుబాటి, మెగా, నందమూరి ఫ్యామిలీలలోని అందరూ విచ్చేయనున్నారు. ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ దర్శకుడు
ఎస్.ఎస్.రాజమౌళి సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు తెలిసింది. ఇక
నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా తప్పక వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన కీలకమైన వ్యక్తులు ఈవేడుకలో
భాగమవుతారని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్