తెలంగాణ, 20 డిసెంబర్ (హి.స.)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్
డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న తాజా మూవీ 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ అమెరికా నుంచి స్టార్ట్ చేశారు.
డిసెంబర్ 21 తేదీన డెల్లాస్లోని కర్టిస్ కల్వెల్ సెంటర్లో భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్కు రామ్ చరణ్ పాటు గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ కూడా విమానం ఎక్కింది. ఈ విషయాన్ని చిత్రబృoదం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్