హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
మీడియా ప్రతినిధిపై దాడి నేపథ్యంలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో ఆయనను విచారించేందుకు పహాడీ షరీఫ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన దుబాయి వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన తరఫు న్యాయవాదులు మాత్రం ఆ ప్రచారాలను ఖండించారు. మోహన్ బాబు దుబాయి వెళ్లలేదని, భారత్‌లోనే ఉన్నారని చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..