తెలంగాణ, 19 డిసెంబర్ (హి.స.)
సినీ నటుడు మోహన్ బాబు కు షాక్ తగిలింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నో చెప్పింది. ఈ సందర్భంగా సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా మోహన్ బాబు న్యాయవాది అభ్యర్ధించారు.. దీనిపై నిర్ణయం తర్వాత చెబుతామని హైకోర్టు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్