హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.) సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఎప్పుడు ఎలాంటి పోస్టు లు పెడతారో ఎవరికీ అర్ధం కాదు. ఒక్కోసారి కొందర్ని అభినందిస్తూ పోస్టులు పెడతాడు.. మరోసారి మరి కొందర్ని విమర్శిస్తూ పోస్టులు పెడతాడు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆర్జీవీ పెట్టిన పోస్టులు 24 గంటలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ట్రోలర్స్ అయితే పండగ చేసుకుంటారు. తాజాగా, పుష్ప2 సినిమాపై ఆర్జీవీ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా నేడు దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత బన్నీ ని థియేటర్ స్క్రీన్ మీద చూసి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికే, ఈ సినిమా గురించి ఎంతో మంది వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ పెట్టాడు.
డైరెక్టర్ ఆర్జీవీ 'పుష్ప2' సినిమా పై ఇంట్రెస్టింగ్ చేసి ఆకాశానికి ఎత్తేశారు. ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అందించినందుకు 'పుష్ప 2' మూవీ టీం కు అభినందనలు. అల్లు ఈజ్ మెగా మెగా మెగా అంటూ అల్లు అర్జున్ ను పొగుడుతూ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్