హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
వ్యూహం సినిమాకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు వచ్చాయి అంటూ జరుగుతున్నా ప్రచారం మీద రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నాపైన నా పార్టనర్ రవివర్మ పైన వచ్చిన ఆరోపణల తాలూకు వాస్తవాలు అంటూ ఆర్జీవి కొన్ని వివరాలు వెల్లడించారు. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోను అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు. 'వ్యూహం' సినిమా దాసరి కిరణ్ కుమార్ నిర్మాత కాగా శ్రీకాంత్ ఫైనాన్స్ను అందించారని, నా పార్టనర్ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్ శ్రీకాంత్ నుండి ఏపి ఫైబర్ నెట్ ప్రసారహక్కులను కొనుగోలు చేశారని అన్నారు. ఏపి ఫైబర్నెట్ రవివర్మనుండి ప్రసార హక్కులను రెండుకోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. కానీ కోటి రూపాయలు మాత్రమే ఎకౌంట్కు వచ్చింది.
ఇది శ్రీకాంత్, రవివర్మలకు సంబంధించిన ఒప్పందం అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..