ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో..
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గ
ఎయిర్ షో


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలకు సుమారు 30 నిమిషాల పాటు వాయిసేన విమానాల విన్యాసాలు జరగనున్నాయి. వైమానిక దళానికి చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ షోకు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వం వహించనున్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన వైమానిక విన్యాసాలు చేసే ఐదు అత్యుత్తమ టీమ్లలో ఒకటైన సూర్యకిరణ్ టీమ్ హైదరాబాద్లో ప్రదర్శన ఇవ్వనుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande