తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.)
సినిమా ప్రమోషన్స్ సమయంలో
పోలీసులు అనుమతి నిరాకరిస్తే, దానిని పాటించాలని సినీ ప్రముఖులకు.. తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారని డీజీపీ తెలిపారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులతో రెండు గంటలపాటు సాగిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. సంధ్యా థియేటర్ ఘటనపై మాట్లాడారు. పోలీసుల నిర్ణయాన్ని టాలీవుడ్ పెద్దలు గౌరవించాలని అన్నారు. బౌన్సర్లు నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలని అన్నారు. ఇటీవల బౌన్సర్లు తీరు, ప్రవర్తన బాగలేదని మండిపడ్డారు. ఏ ఈవెంట్ అయినా ముందోస్తు అనుమతులు తీసుకోవాలని టాలీవుడ్ ప్రముఖులకు తెలంగాణ డీజీపీ సూచించారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన వీడియోలను సినీ ప్రముఖులకు చూపించారు. సంధ్య థియేటర్ లో రేవతి మృతి, తొక్కిసలాట, శ్రీతేజ అపస్మారక దృష్యాలను పోలీసులు సినీ ప్రముఖులకు చూపించారు. హీరో అల్లు అర్జున్ ఎప్పుడు సంథ్యా థియేటర్ కు వచ్చారు దేరారు, అల్లు అర్జున్ రాకతో తోపులాట ఘటన జరిగిన అల్లు అర్జున్ ఎప్పటి వరకు సినిమాను వీక్షించారనేది తెలిపారు. పోలీసులు ఘటన వివరాలు తెలిపిన అల్లు అర్జున్ ఎప్పుడు స్పందించారన్న దానిపై చిక్కడ పల్లి పోలీసులు వీడియో ద్వారా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్