శ్రీకాకుళం,, 26 డిసెంబర్ (హి.స.)ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో స్థానికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రోడ్లకు మరమ్మతు చేయాలని డ్రోన్లతో నిరసన తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస నుంచి భాగ్యమ్మపేట వరకు రోడ్లు మొత్తం గోతులమయంగా మారాయి. దీంతో ఆ రోడ్లకు మరమ్మతు చేయాలంటూ డ్రోన్ ద్వారా నిరసన తెలిపారు స్థానిక ప్రజలు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని ఉంగర మండలంలోని బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయం అయ్యింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజాం నుంచి బేంగపేట వెళ్లేందుకు ఒకే ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఆ బస్సు కూడా రోడ్డు సరిగా లేని కారణంగా అధికారులు దాన్ని రద్దు చేశారు. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇదంతా గమనించిన స్థానికులు రోడ్ల మరమ్మతులపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల