విజయవాడ, 26 డిసెంబర్ (హి.స.)విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే అని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే అంటూ వ్యాఖ్యలు చేశారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ప్రధాని మోదీకి (PM Modi) ఆంధ్రుల హక్కు మీద లేదన్నారు. విశాఖ స్టీల్‌ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయన్నారు. మోదీ దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్‌ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉందని విరుచుకుపడ్డారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు