హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఏడు రోజుల పాటు సభ జరుగగా.. 37.44 గంటల పాటు నడిచింది. ఈ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులు పాస్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచే అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీగా చర్చలు జరిగాయి. ఒకనొక సమయంలో శాసనసభలో యుద్ధవాతావరణమే నెలకొంది. కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన రోజున.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాల చివరి రోజున.. అల్లు అర్జున్ అరెస్ట్, పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన అంశాలపై హాట్ డిస్కషన్ నడిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు