బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపు కు అనుమతి లేదు.. సినీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నేడు సీనీ పెద్దల భేటీ జరిగింది. సంధ్య థియేటర్ ఘటనతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు గురువారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు సాగిన సమావేశంలో బెనిఫిట్ ష
సీఎం రేవంత్ రెడ్డి


తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నేడు సీనీ పెద్దల భేటీ జరిగింది. సంధ్య థియేటర్ ఘటనతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు గురువారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు సాగిన సమావేశంలో బెనిఫిట్ షో, టికెట్ల పెంపుపై మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం బెనిఫిట్ షో, టికెట్ల పెంపు ఉండదని తేల్చిచెప్పారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యుల హాజరు కాగా.. రాఘవేంద్ర రావు, మురళీ మోహన్, దిల్ రాజు, శ్యాంప్రసాల్రెడ్డి, దగ్గుబాటి సురేష్బాబు, త్రివిక్రమ్, నాగార్జున సమావేశంలో మాట్లాడారు. బెనిఫిట్ షో, టికెట్ పెంపుపై సీఎంతో చర్చించిన ఫలితం లేకుండా పోయింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande