హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై
బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రశ్నించే గొంతులపై
కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.పోలీసులతోనే పోలీసు కుటుంబాలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పాలనలో ఒట్లు,తిట్లు తప్పి ఇంకేం లేదని విమర్శించారు. గొప్పగా
ప్రారంభించిన ప్రజాదర్బార్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏదని
అడిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు.అమలు చేయటంలో విఫలమైందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్