హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ సచివాలయంలో రేపు
సోమవారం నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రాలేనని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాలేకపోతున్నట్లుగా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, ప్రత్యేక గుర్తింపు, పోరాటానికి ప్రతీకగా అభివర్ణించారు. విగ్రహావిష్కరణకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్