పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు.. నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగ
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

ఇటీవల కొన్న కారుకు కొండగట్టు అంజన్న ఆలయంలో పూజ చేయించుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. బాధితులంతా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande