హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహిళల చేతులు మీదుగా ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం వివిధ వర్గాలకు చెందిన మహిళలను గుర్తించి వారికి ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది. ఆ టీమ్లో కొందరు సెల్ఫ్ హెల్ప్ గ్రూపునకు చెందిన లేడీస్ సైతం ఉన్నారని సమాచారం. ఈ నెల 9వ తేదీన సాయంత్రం తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. ట్యాంక్బండ్ ప్రాంతాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. విగ్రహావిష్కరణ తర్వాత జరిగే పబ్లిక్ మీటింగ్లో సీఎం ప్రసంగించనున్నారు. ఈ ప్రోగ్రామ్కు స్టేట్ వైడ్గా ఉన్న స్వయం సహాయక గ్రూపు సభ్యులు అటెండ్ కానున్నారు.
ఈ నెల 9న నిర్వహించనున్న ప్రోగ్రామ్కు ఏఐసీసీ నుంచి ఏ లీడర్ వస్తారనే చర్చ పార్టీలో జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సోనియాగాంధీ వచ్చే చాన్స్ లేదని, రాహుల్ లేదా ప్రియాంకాగాంధీలో ఎవరో ఒకరు వస్తారని మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు వారి టూర్ షెడ్యూల్ ఫైనల్ కాలేదని తెలుస్తున్నది. దీంతో రేవంత్రెడ్డి మరోసారి ఆ ఇద్దరు లీడర్లతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్