తిరుమల 26 డిసెంబర్ (హి.స.)
:వేంకటేశ్వరస్వామిని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఎటువంటి ఘర్షణలు లేకుండా శాంతియుతంగా, నిజాయితీగా జరగాలని శ్రీవారిని గతంలో కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ దేవ దేవుడిని ప్రజలు ఎలా అయినా ప్రార్థించవచ్చని, ఆ స్వేచ్ఛ భగవంతుడు మనందరికీ ఇచ్చారని ఆయన అన్నారు. మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే నేరాలు చేయాలనుకునే వారి వెన్నులో వణుకు పుడుతుందని ఆయన చెప్పారు. తప్పు ఎవరు చేసినా కఠిన శిక్షలు విధిస్తేనే ఆడవారికి నిజమైన రక్షణ కల్పించిన వాళ్లమవుతామని గవర్నర్ చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల