కాటేదాన్ పారిశ్రామిక వాడ బిస్కెట్ కంపెనీలో అగ్నిప్రమాదం
తెలంగాణ మార్క్స్ 28 హిందూస్థాన్ సమాచారం రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ క
కాటేదాన్ పారిశ్రామిక వాడ బిస్కెట్ కంపెనీలో అగ్నిప్రమాదం


తెలంగాణ మార్క్స్ 28 హిందూస్థాన్ సమాచారం

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాహాల్ బిస్కెట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంటలు అలుముకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున పాహాల్ కంపెనీకీ చెందిన బిల్డింగ్ లోని టాప్ ఫ్లోర్ లో మంటలు అంటుకున్నాయి. దీంతో ఫైర్ స్టేషన్ కు సిబ్బంది సమాచారం అందించడం జరిగింది.

ఈ ప్రమాదం జరిగినప్పుడు వంద మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు సమాచారం. టాప్ ఫ్లోర్లో ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుందంటున్నారు కంపెనీ యజమాని. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande