తిరుమల నడక మార్గంలో.మళ్ళీ చిరుత సంచారం
తిరుపతి 29 మార్చ్ (హిం.స)– తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.. చిరుత ఓ బాల
తిరుమల నడక మార్గంలో.మళ్ళీ చిరుత సంచారం


తిరుపతి 29 మార్చ్ (హిం.స)– తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.. చిరుత ఓ బాలుడిపై దాడి చేయడం.. మరో చిన్నారి ప్రాణాలు తీసిన తర్వాత.. చిరుతలతో పాటు ఇతర అటవీ జంతువుల కదలికలను పసిగట్టేందుకు ఫారెస్ట్ అధికారులతో కలిసి చర్యలకు దిగిన టీటీడీ.. ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటి కదలికలను గుర్తించి బోన్లను ఏర్పాటు చేస్తూ.. వాటిని బందిస్తూ వచ్చింది.. అయితే, ఇప్పుడు మళ్లీ చిరుతల సంచారం మొదలైనట్టు అధికారులు చెబుతున్నారు.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన డీఎఫ్వో సతీష్ రెడ్డి.. నడకదారిలో చిరుతల సంచారం కొనసాగుతుందన్నారు.. అయితే, ఫిబ్రవరి నెలలో చిరుతల కదలికలు కనిపించలేదని.. కానీ, మార్చి నెలలో ఐదు సార్లు చిరుత కనిపించినట్టు వెల్లడించారు. అధునాతనమైన ట్రాప్ కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు చిరుత కదలికలు గుర్తించి.. సిబ్బందిని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. ఇక, ఏప్రిల్ నెలలో సెంట్రల్ వైల్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతాం.. వారి సూచనలతో నడకదారిలో జంతువుల సంచారానికి అనువుగా ఏర్పాట్లు చేస్తాం అని వెల్లడించారు డీఎఫ్వో సతీష్ రెడ్డి.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande